అంశము : తెలుగు వికీపీడియాలో వ్యాసం ఎడిటింగ్ క్లాసిక్ ఎడిటర్ క్లాసిక్ ఎడిటర్ ను ఉపయోగించి పట్టికలు, జాబితాలు, ఇండెంటేషన్లు, టెక్స్ట్ ఫైల్స్, ప్రత్యేక అక్షరాలు, మరియు సూత్రాలు వ్యాసములో వాడటం ఎలాగో నేర్చుకొంటారు

పాఠ్య లక్ష్యం తెలుగు వికీపీడియా లో ఒక వ్యాసమును సంకలనము చేసేప్పుడు ఉపయోగించే వివిధ ఫోర్మాట్టింగ్ ఎంపికలను తెలుసుకొంటారు.

ఈ పాఠములో -

  1. తెలుగు వికీపీడియాలో వికీపీడియా లో ఎడిటింగ్ - క్లాసిక్ ఎడిటర్ ఫార్మట్టింగ్ - పాఠ్యము 15 నిమిషములు
  2. తెలుగు వికీపీడియా వ్యాసo సంకలనం - వీడియో 36.58 నిమిషాలు
  3. తరచుగా అడిగే ప్రశ్నలు - మరిన్ని వివరాల కొరకు
  4. అభ్యాసము
  5. అభ్యాస ఫలితం : పాఠము ముగిసే సరికి, తెలుగు వికీపీడియాలో వ్యాస సంకలనము చేసేప్పుడు ఉపయోగించే వివిధ ఫార్మట్టింగ్ ఎంపికలను గురించి నేర్చుకొంటారు.

వికీపీడియా వ్యాసాలను సాంప్రదాయకంగా దిద్దుబాటు చేయడానికి వాడే రూపమే వికీ కోడ్(మార్కప్) . కొన్ని విహరిణి(Browser) లలో ఇదొక్కటే పనిచేస్తుంది. మీరు వీటి గురించి అర్ధం చేసుకుంటే దీని ద్వారా విషయాన్ని సున్నితంగా కావలసిన తీరులో ప్రదర్శించవచ్చు .

alt-text-here

వ్యాసం పేరు వ్యాసం యొక్క మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: '''వ్యాసం పేరు''' ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు పేరులో లింకులు పెట్టరాదు.

బొద్దు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు మరియు తరువాత మూడు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని బొద్దు పాఠ్యం అంటారు. వ్యాస ప్రారంభంలో వ్యాస విషయానికి సాధారణంగా బొద్దు పాఠ్యం వాడుతారు. '''బొద్దు పాఠ్యం'''

వాలు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు మరియు తరువాత రెండు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని వాలు పాఠ్యం అంటారు. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి వాలుపాఠ్యం వాడతారు ''వాలు పాఠ్యం''

alt-text-here

మీ విభాగాలను ఇలా ప్రారంభించండి:

రెండు సమానం = = చిహ్నాల మద్య ఉన్న పదబంధం శీర్షికగా ఉంటుంది. మూడు సమానం చిహ్నాల మద్య ఉన్న పదబంధం ఉప శీర్షికగా ఉంటుంది

రెండవ స్థాయి శీర్షిక తో మొదలు పెట్టండి (==); మొదటి స్థాయి శీర్షికలు వాడ వద్దు (=).స్థాయి లను దాటి వెయ్య వద్దు (ఉదాహరణకు, రెండవ స్థాయి తరువాత నాల్గవ స్థాయి రావడం).

నాలుగు లేదా అంతకంటే ఎక్కువ విభాగాలున్న వ్యాసానికి శీర్షికల పట్టిక దానంతట అదే చేరుతుంది. వీలయినంత వరకు, విభాగాలను ఒక క్రమం లో పెట్టండి. దేశాల జాబితా తయారు చేస్తున్నారనుకోండి, వాటిని అక్షర క్రమం లో పెడితే బాగుంటుంది.

alt-text-here

alt-text-here

సులువైన పద్దతి, మెనూ ఉన్న” ఉన్నత” అన్న ట్యాబు ఎంచుకోవటం ద్వారా కావసిన

పట్టిక లో నిలువువరసలు, అడ్డువరసలు పొందటం. వెడల్పు, ఒకదానికొకటి వాటి వెడల్పు నిష్పత్తి మరియు ప్రతి సెల్‌లోని లేఅవుట్ రీడర్ వద్ద ఉన్న అన్ని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని బ్రౌజర్ ద్వారా డైనమిక్‌గా నిర్ణయించబడుతుంది.

alt-text-here

వికీపీడియా వాడే మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లో మూసలు వాడవచ్చు. అంటే ముందే తయారు చేసుకున్న ఒక పాఠాన్ని వ్యాసాల్లోకి చొప్పించవచ్చు. ఉదాహరణకు {{మొలక}} అని టైపు చేస్తే ఆ వ్యాసంలో కింది పాఠం కనపడుతుంది.

alt-text-here

మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి.

మూసల పూర్తి జాబితా కొరకు వికీపీడియా:మూసల జాబితా చూడండి. సాధారణంగా వాడే ఇతర మూసలు ఇవి: {{విస్తరణ}} విస్తరించవలసిన పేజీలకు, {{శుద్ధి}} శుధ్ధి చెయ్యవలసిన పేజీ లకు, {{వికీకరణ}} వికీకరించవలసిన పేజీలకు.

మెనూ లో మూస చిహ్నం ఎన్నుకొని , కావలసిన మూసను శోధించాలి

alt-text-here

ఎడిట్‌ లింకును దాచటం

విభాగాలకు కుడి పక్కన ఉండే ఎడిట్‌ లింకును కనపడ కుండా చెయ్యడానికి __NOEDITSECTION__ అని వ్యాసంలో ఎక్కడో ఒక చోట రాస్తే చాలు.

విషయ సూచిక

ప్రస్తుత వికీ నియమాల ప్రకారం, కనీసం నాలుగు విభాగాలున్న పేజీ కి మొదటి విభాగానికి ముందు "విషయ సూచిక" ఆటోమేటిక్ గా వచ్చి చేరుతుంది. మనకు కావలసిన చోట విషయ సూచిక రావాలంటే __TOC__ అని రాయాలి. మొదటి విభాగం ముందు కాకుండా ఇక్కడ వి.సూ వచ్చి చేరుతుంది. __NOTOC__ అనే వాక్యం పేజీ లో ఎక్కడ రాసినా, ఆ పేజీ లో విషయ సూచిక కనపడదు.

రాసిన విషయం తొలగించటం

తొలగించ వలసిన వచనం ( టెక్స్ట్ ) సెలెక్ట్ చేసి , మౌస్ ద్వారా cut , లేదా కీబోర్డులో డిలీట్ ( Delete) బటన్ ను నొక్కాలి.

alt-text-here

మూలాలు

మూలాల జాబితా టాగ్ లేదా సమానమైన మూస ఈ పాద సూచికలు కనబడే స్ధానాన్ని నిర్ణయిస్తుంది. సాధారణంగా వ్యాసం చివరిలో గమనికలు లేక మూలాల విభాగంలో వుంటుంది. <మూలాలజాబితా/>

మూలాలు చేర్చటానికి పట్టికలో ఉన్న మూలాలు చేర్చండి వద్ద క్లిక్ చేయండి , మీరు ఇచ్చే మూలాలను బట్టి cite మూసలు ఎంపిక చేసుకొనండి.

alt-text-here

వెలుపలి లింకులు

తెరిచే ఒక స్క్వేర్ బ్రాకెట్ తర్వాత యు.ఆర్.ఎల్‌(URL) చేర్చి తరువాత ఖాళీ అక్షరము మరియు సూచించేపాఠ్యం మరియు మూసే ఒక స్క్వేర్ బ్రాకెట్ సాధారణ హైపర్ లింకు తయారవుతుంది. సాధారణంగా వ్యాసంలో ముఖ్య భాగాలలో వాడరు. పాదసూచికలలో గాని బయటి లింకులు విభాగంలో వాడతారు. http://www.example.com సూచించే పాఠ్యం]

వర్గాలు

వ్యాసానికి చివరగా వర్గం: తో ప్రారంభమయ్యే పదబంధం చుట్టూ రెండు స్క్వేర్ బ్రాకెట్లను చేర్చితే వ్యాసం ఆ వర్గంలోకి చేరుతుంది. ఒక విషయానికి సంబంధించిన వ్యాసాలను సమితులుగా నిర్వహించడానికి ఇవి ఉపకరిస్తాయి. [[వర్గం:వర్గం పేరు]]

వచనం పెద్దదిగా లేదా చిన్నదిగా

గుర్తించబడిన ప్రాంతం యొక్క ఫాంట్ పరిమాణాన్ని మార్చడానికి సంబంధిత మెను అంశంపై క్లిక్ చేయండి

వచ్చేలా లేదా తగ్గించేందుకు వీటిని వాడండి ట్యాగ్‌లు (పెద్ద [3] ) లేదా (చిన్నవి) ఫార్మాటింగ్ ఎలిమెంట్స్‌గా పేజీ యొక్క మూల వచనానికి జోడించబడతాయి

alt-text-here

వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని చర్చా పేజీ అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి చర్చ అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి గురించి లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు

చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం ఒక మంచి వికీ సాంప్రదాయం. సవరణ పెట్టెలో వికీ సంతకం చేయడానికి ఉపకరించే చిహ్నం ను గమనించండి. మీరు ఈ బటన్ నొక్కినటైతే (~~~~) ఇలా వరుసగా నాలుగు టిల్డేలు చేర్చబడతాయి. భద్రపరచిన తరువాత సందేశం తరువాత మీ పేరు, పంపిన తేదీ మరియు సమయం కనబడుతుంది.

alt-text-here

alt-text-here

వికీకోడ్ / క్లాసిక్ ఎడిటర్ అంటే ఏమిటి ?

వికీపీడియా లో విజువల్ ఎడిటర్ రాకముందు డీఫాల్ట్ గా వున్నా ఎడిటర్ ఇందులో ఫార్మాటింగు సాధారణ వర్డు ప్రాసెసర్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఏది రాస్తే అదే కనబడే పద్ధతిలో గాక, వికీపీడియా కొన్ని టెక్స్టు కోడ్లను ఫార్మాటింగు కోసం వాడుతుంది. దీన్ని వికిటెక్స్ట్ లేదా వికీ-మార్కప్ అని అంటారు వికీకోడ్ / క్లాసిక్ ఎడిటర్ దీని ఆధారంగా చేస్తుంది, కొన్ని ఎడిట్లు చేయటానికి సోర్స ఎడిట్ చేయటానికి ఇది సులభంగా ఉంటుంది.

ఒక వ్యాసంలో వర్గం చేర్చటం ఎలా ?

వ్యాసాన్ని ఏదైనా వికీపీడియా:వర్గంలో చేర్చాలంటే, కుడి పక్కన చూపించినట్లు ఒక లింకును వ్యాసంలో ఎక్కడో ఒక చోట పెట్టండి. భాషాంతర లింకు వలెనే దీనిని కూడా వ్యాసంలో ఎక్కడైనా పెట్టవచ్చు, కాకపోతే వ్యాసపు చివర ఉంచితే బాగుంటుంది.

వికీ మార్కప్ అంటే ఏమిటి

వికీపీడియా వ్యాసాలను దిద్దుబాటు చేయడానికి తొలినుంచీ వాడే రూపం వికీ కోడ్(మార్కప్) . వికీపీడియాలో ఉన్న ప్రతి పేజీ ఈ మూలపాఠ్యము లేనే ఉంటుంది [[]] Source Editing ద్వారా దీనినిచూడవచ్చు .

వ్యాకరణ చిహ్నాలు ఎలావాడాలి

మామూలుగా అచ్చు పుస్తకాలలో వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి.

సాధారణంగా డబల్‌ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి.

ఒక ఇంగ్లీష్ సోర్సు వికీపీడియా వ్యాసాన్ని కాపీ చేసి తెలుగులో రాయవచ్చా

రాయవచ్చు అయితే అందులో ఉన్న భాష తప్ప వికీ మార్కప్ లాగ్వేజ్ కోడ్ మార్చవద్దు

మక్కీకి మక్కీ అనువాదాలు బాగుండవు. అనువాదములో వీలైనంత వరకు మూలములోని సమాచారాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి

తేదీలు, సమయం, కాలం ఎలా రాయాలి ?

భారతదేశం లో సాధారణముగా అనుసరించే శైలి ఆకృతి yyyy month dd రూపంలో రాయాలి లేదా తేదీ ప్రాముఖ్యం వున్న వ్యాసాలను ముందు తేదీతో రాయాలి. ఉదాహరణకు, ఫలానా వ్యక్తి 1980 అక్టోబరు 09 న జన్మించాడు అని రాయాలి.

వికీ మార్కప్ చీట్‌షీట్ అంటే ఏమిటి

తరచుగా వాడే వికీ మార్కప్ వివరాలను చీట్ షీట్ అనివ్యవహరిస్తారు .ఇది ఒక గైడులా చేస్తుంది

alt-text-here

https://forms.gle/vWmmbi8ZAr4mfeys5​